చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో ఓ యువకుడు అనుమానస్పదంగా మృతి చెందాడు. షికారి కాలనీకి చెందిన బబ్లీ అదృశ్యమయ్యాడు. స్థానికులు అతని కోసం వెతకుతుండగా చింతలపాలెం సమీపంలో ఓ గుంతలో రక్తం మడుగులో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా భావిస్తున్నట్లు సీఐ శివ కుమార్ తెలిపారు. గాయాలను బట్టి హత్యకు గురై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏర్పేడు మండలంలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి - murder news in yerpedu mandal chittoor
అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం చింతలపాలెం సమీపంలో జరిగింది. మృతుడు రక్తం మడుగులో ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏర్పేడు మండలంలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి