తిరుమల శ్రీవారి గర్భాలయంలోని స్వామి సన్నిధిలో దీపం ఆరిపోయిందని జరుగుతున్న ప్రచారంను ప్రధాన అర్చకులు ఖండించారు.ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఇతర అర్చకులతో కలసి కైకర్యాల నిర్వహణ గురించి వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నందున భక్తులు పూజలకు దూరంగా ఉన్నారని తెలిపారు. స్వామివారికి నిర్వహించే పూజలన్నీ క్రమం తప్పకుండా జరుగుతున్నాయని భక్తకోటికి తెలిపారు.
'శ్రీవారి గర్భాలయంలో దీపం వెలుగుతోంది' - Tirumala news
తిరుమల శ్రీవారి గర్భాలయంలో దీపం ఆరిపోయిందని జరుగుతున్న ప్రచారంపై.. శ్రీ వారి ఆలయ అర్చకులు స్పందించారు. దీపం ఆరిపోలేదని, శ్రీవారికి నిత్యపూజలు కొనసాగుతున్నాయని తెలిపారు.
' శ్రీవారి గర్భాలయంలో దీపం వెలుగుతోంది'