గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లా పెదమాండ్యంలో అత్యధికంగా 19.9 సెంటిమీటర్లు నమోదు కాగా... కడప జిల్లా పులివెందులలో 16.9, అనంతపురం జిల్లా నల్లచెరువులో 17.1 సెంటిమీటర్ల వర్షం కురిసింది. కడప జిల్లా సింహాద్రిపురంలో 17 సెంటిమీటర్లు, చిత్తూరు జిల్లా కలకాడలో 16.8 సెంటిమీటర్లు, వడమాలపేటలో 16.5 సెంటిమీటర్లు వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా గాజులవారీ పల్లెలో 14.8, కడప జిల్లా లింగాలలో 14.8, బుక్కరాయసముద్రంలో 14.5 సెంటిమీటర్ల వాన పడింది. ధర్మవరంలో 13.5 సెంటిమీటర్లు, తంబళ్లపల్లెలో 13.8 సెంటిమీటర్లు, పత్తికొండ 13.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
HEAVY RAINS: ఆ జిల్లాలోనే అత్యధిక, అత్యల్ప వర్షపాతం నమోదు..! - చిత్తూరులో అత్యధిక వర్షపాతం నమోదు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లా పెదమండ్యంలో 19.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా... అత్యల్పంగా చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో 10 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
ఆ జిల్లాలోనే అత్యధిక, అత్యల్ప వర్షపాతం నమోదు..!
అలాగే రామచంద్రాపురంలో 13 సెంటీ మీటర్లు, పలమనేరు 13 సెంటిమీటర్లు, శ్రీకాళహస్తిలో 12.7 సెంటిమీటర్లు, ప్రకాశం జిల్లా ఉలవపాడులో 12 .5 సెంటిమీటర్లు. కడప జిల్లాలో 11 సెంటిమీటర్లు, చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ఇదీ చూడండి:LIVE VIDEO: తిరుచానూరులో వరద ధాటికి కుప్పకూలిన భవనం