తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక బాధితులు మరిణించిన అంశంపై తెదేపా నేత ఏఆర్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది . ఈ ఘటనలో 23 మంది కన్నా ఎక్కువ మందే మరణించారని పిటిషనర్ తరపు న్యాయవాది.. ధర్మాసనానికి తెలిపారు . మరణించిన వారి వివరాలు జిల్లా కలెక్టర్ కు అందజేయాలని న్యాయస్థానం సూచించింది .
ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ఆక్సిజన్ సరఫరా చేసిన కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .