చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలోని రెప్పాలపట్టు గ్రామానికి చెందిన గోపి శనివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం బంధువులు, జాలర్లు పడవల సాయంతో అరణియర్ ప్రాజెక్టులో గాలించగా... ఆదివారం ఉదయం అతని మృతదేహాన్ని గుర్తించారు.
వేటకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం - చిత్తూరు క్రైం వార్తలు
పిచ్చాటూరు అరణియర్ ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. చేపల వేటకు వెళ్లి గోపి గల్లంతయ్యాడు.

the-dead-body-of-the-man-who-went-to-the-hunt-was-available-at-pichaturu-in-chitoor-district
పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. గోపి మరణంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి:కొబ్బరిబోండాలు దొంగతనం చేశాడని.. నరికేశారు!