నేటి నుంచి చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. కరోనా దృష్ట్యా ఏకాంతంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నేడు వినాయక చవితి పురస్కరించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రేపు ధ్వజారోహణం, రాత్రి హంస వాహన సేవలను జరపనున్నారు.
అలాగే ఈ నెల
- 12న నెమలి, 13న మూషిక, 14న శేషవాహన సేవలు
- 15న ఉదయం చిలుక, రాత్రి వృషభ సేవలు
- 16న గజ సేవ, 17న రథోత్సవం
- 18న తిరుకల్యాణం, అశ్వవాహన సేవ
- 19న తీర్థవారి త్రిశూల స్నానం, వడాయత్తు ఉత్సవంతో పాటు ఏకాంత సేవతో వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అలాగే ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.