చిత్తూరు జిల్లా తిరుపతిలోని గోపాల్ రాజు కాలనీలోని కాలువలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. గమనించిన కాలనీవాసులు తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. మృతుడు సాయినగర్ పంచాయతీలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన విజయ్ గా గుర్తించారు. హత్య చేసి కాల్వలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శవపరీక్ష నినిత్తం మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు.
కాలువలో యువకుడి మృతదేహం.. హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానం - తిరుపతి నేర వార్తలు
తిరుపతిలోని గోపాల్రాజు కాలనీలోని కాల్వలో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![కాలువలో యువకుడి మృతదేహం.. హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానం The body of a young man in the canal and Police suspect that he was murdered in thirupathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7669451-630-7669451-1592478920653.jpg)
కాలువలో యువకుడి మృతదేహం.