చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని వారిపల్లి సమీపంలో మూడు రోజుల క్రితం చెరువులో మునిగిపోయిన వెంకటరమణ మృతదేహం ఇవాళ దొరికింది. అయ్యప్పమాల వేసే ముందు స్నానానికి వెళ్లిన వెంకటరమణ.. ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. రెండు రోజులుగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఎంత గాలించినా దొరకని మృతదేహం.. సోమవారం బయటకు తేలింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య, పిల్లలను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మూడు రోజుల క్రితం గల్లంతు.. చెరువులో తేలిన మృతదేహం - మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం వారిపల్లిలో చెరువులో మునిగిపోయిన వ్యక్తి మూడు రోజుల తర్వాత శవమై తేలాడు. అయ్యప్పమాల వేసే ముందు స్నానానికి వెళ్లిన వెంకటరమణ.. ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు గాలించినా మృతదేహం దొరకలేదు. అయితే సోమవారం మృతదేహం నీటిలో తేలింది.
మూడు రోజుల తర్వాత తేలిన మృతదేహం