ప్రభుత్వ వైద్యురాలు అనితారాణిపై వైకాపా నాయకుల వేధింపుల అంశాన్ని రాష్ట్ర, జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి వెల్లడించారు. చిత్తూరు అనితారాణిని పరామర్శించిన ఆయన... ఆమెకు సంఘీభావం ప్రకటించారు. మహిళా వైద్యురాలి పట్ల వైకాపా నాయకులు ప్రవర్తనను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల విచారణ నివేదికను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించనున్నట్లు తెలిపారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
వైద్యురాలు అనితారాణిని పరామర్శించిన భాజపా నేత
డాక్టర్ అనితారాణి న్యాయ పోరాటానికి భాజపా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని... భాజపా రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. చిత్తూరులో అనితారాణిని పరామర్శించిన ఆయన... ఆమెకు సంఘీభావం తెలిపారు. వైకాపా నాయకుల దౌర్జన్యంపై నిజాలు నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం నియమించిన సీఐడీ అధికారులపై తనకు నమ్మకం లేదని వైద్యురాలు అనిత చెప్పారు.
వైద్యురాలు అనిత రాణిని పరామర్శించిన భాజపా నేత