ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు.. తమిళనాడు బస్సులు సీజ్​ - latest news in chittor

చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతున్న తమిళనాడు బస్సులను రాష్ట్ర రవాణా శాఖ అధికారులు సీజ్​ చేశారు. తమిళనాడు ఆర్టీసీకి చెందిన 28 బస్సులతో పాటు.. మరో 4 ప్రైవేటు బస్సులు సైతం స్వాధీనం చేసుకున్నారు.

AP Transport Department
చిత్తూరులో 28 తమిళనాడు ఆర్టీసీ బస్సులు సీజ్​

By

Published : Jan 17, 2021, 10:50 AM IST

చిత్తూరు జిల్లాలోని కుప్పం, నగిరి, సత్యవేడు, పుత్తూరు, పలమనేరు ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన బస్సులను రాష్ట్ర రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు గుర్తించి.. చర్యలు తీసుకున్నారు. తమిళనాడు ఆర్టీసీకి చెందిన 28 బస్సులతో పాటు.. నాలుగు ప్రైవేటు బస్సులను స్వాధీనం చేసుకుని ఆర్టీసీ డిపోల్లో ఉంచారు.

ABOUT THE AUTHOR

...view details