ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా సూచించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లి మిట్ట ఉన్నత పాఠశాలలో నాడు నేడు అభివృద్ధి పనులను తనిఖీ చేసిన ఆయన నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో జిల్లా స్థాయి అధికారులతో విస్తృతంగా పర్యటించారు. పనులు మరింతగా అభివృద్ధి చేసేందుకు మండల స్థాయి అధికారులకు తగిన సూచనలు చేశారు.
పాఠశాలలో నాడు-నేడు పనులు పరిశీలించిన పాలనాధికారి - నెల్లూరు జిల్లాలో నాడు నేడు వార్తలు
పాఠశాలల్లో నాడు-నేడు పథకం ద్వారా జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాలనాధికారి హెచ్చరించారు. నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లి మిట్ట ఉన్నత పాఠశాలలో నాడు నేడు అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన సంబంధిత అధికారులకు పలు అంశాలపై ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాలలో నాడు-నేడు పనులు పరిశీలించిన పాలనాధికారి