ముగ్గురు పదోతరగతి విద్యార్థులు అదృశ్యం...! - ముగ్గురు పదోతరగతి విద్యార్థులు అదృశ్యం
పాఠశాలకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ఇంటికి తిరిగిరాలేదు. వీరిలో ఇద్దరు బాలికలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అదృశ్యమైన వారి కోసం వెదుకుతున్నారు.
మిస్సింగ్
చిత్తూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. స్థానిక గిరింపేటలోని దేవీ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కౌసల్య, సౌమ్య, దిల్లి బాబు గురువారం పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. వారి ఆచూకీ లేకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TAGGED:
student missing