ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువగళంలో ఉద్రిక్తత.. లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు - లోకేశ్ పాదయాత్రను

lokesh
lokesh

By

Published : Feb 8, 2023, 4:31 PM IST

Updated : Feb 8, 2023, 5:03 PM IST

16:21 February 08

సభ నిర్వహణకు అనుమతి లేదంటూ లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు

Police blocked Lokesh: చిత్తూరు రూరల్‍ మండలంలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న లోకేశ్​ను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్​ఆర్​పేటలోని ఎన్టీఆర్‍ కూడలిలో లోకేశ్​ను కలిసేందుకు వచ్చిన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతుండగా.. సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు హరించడం దారుణం అంటూ పోలీసులపై లోకేశ్‍ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీఓ 1 ప్రకారం రోడ్ల మీద సమావేశం ఏర్పాటు చెయ్యడానికి అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు. అందుకే ప్రత్యామ్నాయం చూపించాలని ముందుగానే అడిగామని లోకేశ్‍ పోలీసులకు తెలిపారు. ఎక్కడ సభ నిర్వహించుకోవాలో మీరే చెప్పండంటూ లోకేశ్‍ డీఎస్పీని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కూడలిలో స్టూల్​పై నిలబడి చిన్న మైక్​తో తనని కలవడానికి వచ్చిన ప్రజల్ని ఉద్దేశించి లోకేశ్‍ మాట్లాడారు. జగన్​కు భయమంటే ఏంటో చూపిస్తానని... సభ పెట్టుకోడానికి ఎక్కడా అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ పెట్టాలని.. తాడేపల్లి ప్యాలస్​లో పెట్టుకోవాలా అంటూ పోలీసుల్ని ప్రశ్నించారు. దీంతో మైక్ లాక్కోవడానికి పోలీసులు ప్రయత్నించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 8, 2023, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details