ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలోని పలు పోలింగ్​ కేంద్రాల వద్ద ఉద్రిక్తత - Tension at polling stations news

చిత్తూరు జిల్లాలోని పలు పంచాయతీల్లో ఉద్రిక్తత నెలకొంది. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవటం లేదంటూ పలువురు ఓటర్లు ఆరోపించారు. మరోచోట ఎన్నికల అధికారులు పోలింగ్​ నిలిపేశారు.

Tension at polling stations
పోలింగ్​ కేంద్రాల వద్ద ఉద్రిక్తత

By

Published : Feb 9, 2021, 4:51 PM IST

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని మాంబేడు, ఆర్కే ఎం పురం పోలింగ్ బూత్​లలో అధికార పార్టీ మద్దతుదారులు... తమపై దాడి చేశారంటూ బూత్ ఏజెంట్లు, అభ్యర్థులు ఆందోళనకి దిగారు. పోలింగ్​ కేంద్రాల్లో ఎవరికి ఓటు వేయాలో అధికారులే చెబుతున్నారంటూ ఆరోపణలు చేశారు. మాంబేడు పంచాయతీకి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ వెదురుకుప్పం పోలీస్​స్టేషన్ ఎదుట నినాదాలు చేశారు.

ఎస్ఆర్ పురంలో

మండలంలోని కొత్తపల్లి పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ అభ్యర్థి ఒకరు కొత్తపల్లి మిట్ట పోలింగ్ కేంద్రం 5వ బూత్ బ్యాలెట్ బాక్స్​లో నీళ్లు పోశారని ఆరోపణలు రావటంతో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ ఆపివేసిన ఎన్నికల అధికారులు.. పోలీసుల సాయంతో అందరినీ పోలింగ్ కేంద్రం నుంచి బయటకి పంపారు.

ఇదీ చదవండి:వైకాపా నేతల దౌర్జన్యంపై చంద్రబాబు ధ్వజం

ABOUT THE AUTHOR

...view details