Tension at kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో.. గంగమ్మ ఆలయ మాజీ ఛైర్మన్ పార్థసారథి ఆత్మహత్య వివాదాస్పదంగా మారింది. గురువారం నాడు పార్థసారథి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడటంతో.. కుప్పంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మృతుని సెల్ఫీ వీడియోతో సరికొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయ ఛైర్మన్ పదవికి వైకాపా నాయకులు తన వద్ద రూ.15 లక్షలు తీసుకున్నారని పార్థసారథి వెల్లడించారు. ఆయన అంత్యక్రియలకు వాల్మీకి సంఘాల నేతలు భారీగా తరలివస్తుండటంతో.. పోలీసులు భారీగా మోహరించారు.
Suicide: ఛైర్మన్ పదవి కోసం నేతలకు ఇచ్చిన సొమ్ముతో పాటు ఆలయ అభివృద్ధి కోసం చేసిన అప్పులు తీర్చడం ఇబ్బందిగా మారడంతో పాటు.. అవమానకరంగా ఛైర్మన్ పదవి నుంచి తప్పించడంతోనే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోందంటూ..పార్థసారథి తీసుకొన్న సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. రెస్కో ఛైర్మన్ సెంథిల్, ఆయన సోదరుడు ఒత్తిడి వల్లనే తన అన్న చనిపోయాడని..మృతుని సోదరుడు ఆరోపిస్తున్నారు.