చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. మండలంలోని పెద్దపాళ్యం గేట్ వద్ద మినీ ట్రకు.. చెట్టును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో 14 మంది ఉండగా.. 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్లలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా... మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు.
చెట్టును ఢీకొన్న మినీ ట్రక్కు... 10 మందికి గాయాలు - చిత్తూరు జిల్లా పెద్ద పాళ్యం గేట వద్ద రోడ్డు ప్రమాదం
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం పెద్దపాళ్యం గేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ ట్రక్కు.. చెట్టును ఢీకొన్న ఘటనలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాధితులు కదిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
చెట్టును ఢీకొట్టిన మినీ ట్రక్కు
బాధితులంతా మదనపల్లి, పెద్దతిప్పసముద్రం మండలాలకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ట్రక్కు స్టీరింగ్ రాడ్ జామ్ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదీచూడండి:'ఎన్నికల్లో పోటీ చేస్తే.. జీవనాధారం లేకుండా చేస్తారా?'