ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుయా మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేత - rs 10 lacks check to ruya victim family

ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్ డా. శిరీష.. తిరుపతి రుయా ఘటనలో మృతి చెందిన కరోనా బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కును మృతుడి కుటుంబానికి అందజేశారు.

check to ruya victim family members
check to ruya victim family members

By

Published : May 22, 2021, 9:19 PM IST

తిరుపతి రుయా ఘటనలో మృతి చెందిన జయచంద్ర అనే కరోనా బాధితుడి కుటుంబాన్ని మేయర్ డా. శిరీష, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పరామర్శించారు. సుందరయ్య నగర్​లో ఉన్న మృతుడి ఇంటికి వెళ్లిన ప్రజా ప్రతినిధులు.. ఆయన మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున పరిహారం రూ.పది లక్షల చెక్కును మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details