చిత్తూరు జిల్లా తిరుమలలో పది అడుగుల కొండ చిలువను స్థానికులు గుర్తించారు. కల్యాణ వేదిక వద్ద రహదారికిపైకి వస్తున్న దానిని గమనించిన జనం పాములు పట్టే వారికి సమాచారం అందించారు. పాములు పడ్డటంలో నేర్పరి అయిన బాబు దానిని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. జన సంచారం తక్కువగా ఉండడంతో తరచూ అటవీ జంతువులు, పాములు రహదారులపైకి వస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద రోడ్డపైకి కొండ చిలువ.. - chittoor today latest news
చిత్తూరు జిల్లా తిరుమలలో భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. రహదారిపైకి వస్తున్న కొండ చిలువను గుర్తించిన స్థానికులు పాములు పట్టే వారికి సమాచారం ఇచ్చారు. వారు కొండ చిలువను చాకచక్యంగా పట్టుకోవడం జనం ఊపిరి పీల్చుకున్నారు.
![తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద రోడ్డపైకి కొండ చిలువ.. Ten foot python in Tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7621355-674-7621355-1592203955025.jpg)
తిరుమలలో భారీ కొండ చిలువ