ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Red sandal: చిత్తూరు జిల్లాలో 10 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

By

Published : Jul 1, 2021, 6:08 PM IST

Updated : Jul 1, 2021, 9:49 PM IST

ten crore worth of red sandalwood seized in Chittoo
చిత్తూరు జిల్లాలో 10 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

18:06 July 01

చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడిపాల మండలం గొల్లమడుగ చెక్‌పోస్టు వద్ద  తనిఖీలు చేపట్టి రూ.10 కోట్ల విలువైన 10 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...చిత్తూరు నుంచి వేలూరు వెళ్తున్న టాటా స్పేసియో వాహనాన్ని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా..డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. వాహనాన్ని వెంబండించి పట్టుకున్న పోలీసులు..తనిఖీ చేయగా 6 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. ఏడుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. సగ్లర్లు ఇచ్చిన సమాచారం మేరకు తమిళనాడులోని శ్రీ పెరంబదూరు సమీపంలోని వలర్పురం, సెబాయి జాయ్ రీట్రీట్ సెంటర్​లో ఎర్రచందనం దుంగల డంపును గుర్తించారు.  

దాడుల్లో సుమారు 10 టన్నుల టన్నుల బరువు గల 353 ఎర్రచందనం దుంగలు, ఒక మిని లారీ, ఒక టాటా సుమో, ఒక మహేంద్ర జైలో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు ఎస్పీ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన నాగరాజు, రామరాజు, ప్రభు, విజయకుమార్, సంపత్, అప్ప స్వామి, దొరై రాజ్​లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.  

ఇదీచదవండి

Missing : విశాఖలో ముగ్గురు యువతులు మిస్సింగ్... పోలీసుల దర్యాప్తు

Last Updated : Jul 1, 2021, 9:49 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details