తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్ పరీక్షల్లో మరికొన్ని పోస్టులు - గ్రూప్4లో మరికొన్ని పోస్టులు చేర్చిన సర్కార్
TSPSC Some posts added in Groups : తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే గ్రూప్ సర్వీసుల్లో పోస్టుల భర్తీపై ప్రకటన చేసిన సర్కార్ తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. అదేంటో చూడండి మరి.

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
TSPSC Some posts added in Groups : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే గ్రూప్ సర్వీసుల్లో పోస్టుల భర్తీపై ప్రకటన చేసిన సర్కార్ తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. గ్రూప్- 2, 3, 4 లో మరికొన్ని రకాల పోస్టులు చేరుస్తూ నిరుద్యోగులకు తీపి కబురు అందజేసింది. మరి ఏ గ్రూపులో ఎన్ని రకాల పోస్టులు, ఏ పోస్టులు చేర్చిందో ఓసారి చూసేయండి.
- గ్రూప్ -2 లో రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు రకాల పోస్టులు చేర్చింది. అవేంటంటే.. రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్‌వో పోస్టులు, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు చేర్చింది.
- గ్రూప్-3 లో మరో రెండు రకాల పోస్టులు యాడ్ చేసింది. అవేంటంటే.. గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్, హెచ్‌వోడీల్లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, హెచ్‌వోడీల్లోని జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు
- గ్రూప్-4 లో మరో 4 రకాల పోస్టులు చేర్చుతూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. అవేంటంటే.. జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్ వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులు చేరుస్తూ ప్రకటించింది.
- ఇవీ చదవండి :
- ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ..
- సీబీఐ విచారణను స్వాగతిస్తున్నా: సోమిరెడ్డి
- ధాన్యం కొనుగోళ్లలో భారీగా అవకతవకలు.. సోము వీర్రాజు