తిరుమల శ్రీవారిని తెలంగాణా ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డి, తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. కృష్ణా జలాలపై భిన్నాభిప్రాయాలు తొలగి, రైతులకు మేలు జరగాలని.. వేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ ఎమ్మెల్యే, ఎన్నికల కమిషనర్ - తిరుమలలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్
తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి దేవాలయ సిబ్బంది తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ ఎమ్మెల్యే, ఎన్నికల కమిషనర్
త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెల్లడించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు ఉంటాయని పార్థసారథి వివరించారు.
ఇదీ చదవండి:తితిదే ఉద్యోగుల క్వార్టర్స్‌ను తనిఖీ చేసిన జేఈవో