లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన పేదలను ఆదుకునేందుకు చిత్తూరు జిల్లా వెదురుకుప్పం ఉపాధ్యాయులు ముందుకు వచ్చారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల శాఖ ఆధ్వర్యంలో 75 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందించారు. నిత్యావసర వస్తువులను రెవెన్యూ అధికారులకు అందించి, వారి ద్వారా పేదలకు పంపిణీ చేయించారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటూ, కరోనా వ్యాప్తి నివారించేందుకు ప్రభుత్వానికి సాయం చేయాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సూచించారు.
పేదలకు నిత్యావసర వస్తువులు అందించిన ఉపాధ్యాయులు - వెదురుకుప్పం ఉపాధ్యాయుల సాయం
లాక్డౌన్ వలన ఇంటికే పరిమితమైన పేద ప్రజలకు వెదురుకుప్పం ఉపాధ్యాయులు నిత్యావసర వస్తువులు అందజేశారు. ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని వారు సూచించారు.

పేదలకు నిత్యావసర వస్తువులు అందించిన ఉపాధ్యాయులు