రెండేళ్లుగా చిన్నారులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడి కీచకచేష్టలు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని వేణుగోపాలపురం ప్రభుత్వ పాఠశాలలో... ఓ ఉపాధ్యాయుడి చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా... పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రాథమిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంద్రశేఖర్... రెండేళ్లుగా విద్యార్థునులపై లైంగిక దాడికి పాల్పపడుతున్నాడు. ఆ టీచర్ చేష్టల గురించి పిల్లల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు. ఎంఈవోకు చెప్పినా చర్యలు తీసుకోలేదు. బాధితుల తల్లిదండ్రులు రేణిగుంట ఠాణాలో ఫిర్యాదు చేశారు.
విద్యార్థునులపై... రెండేళ్లుగా లైంగిక వేధింపులు..? - ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు వార్తలు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే వెకిలి చేష్టలు చేస్తే... ఆ విద్యార్థునులు ఎవరికి చెప్పుకోవాలి..? అదే దుస్థితి ఎదురైంది ఓ పాఠశాలలో. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆ బాలికలు పోలీసులను ఆశ్రయించారు.
వేణుగోపాలపురం ప్రభుత్వ పాఠశాల