teacher beating student: చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో చేతిరాత బాగాలేదని.. హరీష్ అనే ఏడో తరగతి చదివే విద్యార్థిని ని శివ అనే ఉపాధ్యాయుడు చితకబాదారు. తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్న హరీష్ ను తల్లిదండ్రులు ఆసుపత్రిలో చూపించగా భుజం ఎముక పక్కకు జరిగినట్లు డాక్టర్లు తెలిపారు. పిల్లలను ఎముకలు విరిగేలా కొడతారా అంటూ.. తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో విద్యార్ధి తల్లిదండ్రులు మాట్లాడుతూ... తమ కూమరుడిని సైతం గతంలో ఇదే పాఠశాలకు చెందిన దామోదర్ అనే ఉపాధ్యాయుడు మెడపైన కొట్టడంతో ఆ విద్యార్థి మూడురోజులపాటు ఇబ్బంది పడినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఎవరికైనా పిర్యాదు చేస్తే సదరు విద్యార్థిని టార్గెట్ చేస్తూ డీ గ్రేడ్ చేయడం, మార్కులు తగ్గించడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థి చేతిరాత బాగా లేదని.. ఉపాధ్యాయుడు ఎంత పని చేశాడంటే..! - చేతిరాత బాగా లేదని చేయి విరగ్గొట్టిన మాస్టర్
teacher beating student: చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీచైతన్య టెక్నో పాఠశాలలో చేతిరాత బాగాలేదని హరీశ్ అనే ఏడో తరగతి విద్యార్థిని శివ అనే ఉపాధ్యాయుడు చితకబాదాడు. తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్న హరీశ్‌ను తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించగా... భుజం ఎముక పక్కకు జరిగినట్లు వైద్యులు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
teacher beating student