ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూములు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇస్తాం : కమిషనర్ - తిరుపతి నగరపాలక సంస్థ మాస్టర్ ప్లాన్

తిరుపతి నగరపాలక సంస్థ మాస్టర్ ప్లాన్ పరిధిలో భాగంగా నిర్మిస్తున్న రహదారులను నగరపాలక సంస్థ కమిషనర్ గిరిషా పరిశీలించారు. డి.బి.ఆర్ రోడ్డు నుంచి రవీంద్రనగర్ వరకు నిర్మిస్తున్న 60 అడుగుల రహదారి, అక్కరంపల్లె నుంచి హీరో హోండా షోరూం వరకు నిర్మిస్తున్న రహదారుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

భూములు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇస్తాం : కమిషనర్
భూములు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇస్తాం : కమిషనర్

By

Published : Oct 16, 2020, 7:13 AM IST

తిరుపతి నగరపాలక సంస్థ మాస్టర్ ప్లాన్ పరిధిలో భాగంగా నిర్మిస్తున్న రహదారులను నగరపాలక సంస్థ కమిషనర్ గిరిషా పరిశీలించారు.

నగర వాసులు సహకరించాలి..

ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, నగరపాలక సంస్థ సర్వేర్లతో కలిసి నిర్మాణ వివరాలను ఆరా తీశారు. నగరంలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ రహదారులు, అభివృద్ధి పనులకు నగర ప్రజలు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. రహదారుల నిర్మాణాలకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారితో పాటు భూములిచ్చిన రైతులతో చర్చించారు.

ఆ భూములకు అధిక ధరలు..

రహదారి నిర్మాణాలకు ఎవరికీ ఇబ్బంది లేకుండా 60 అడుగులు మాత్రమే సేకరిస్తున్నామని తెలిపారు. రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి టి.డి.ఆర్. బాండ్లు అందచేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ రహదారులతో నగరంలో ట్రాఫిక్ పూర్తిగా తగ్గుతుందన్నారు. రహదారుల వెంబడి భూములకు అధిక ధరలు వస్తాయన్నారు.

ప్రతి ఒక్కరూ సహకరించాలి..

నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రఘు కుమార్, విజయ్ కుమార్ రెడ్డి, పట్టణ ప్రణాళిక అధికారులు, రైతులు ఉన్నారు.

ఇవీ చూడండి : ఆడ బిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు ఎందుకు..?: పవన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details