తెదేపా హయాంలో పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను.. సంక్రాంతి నాటికి పంపిణీ చేయాలని ఆ పార్టీ నేత నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని టిడ్కో గృహాలను స్థానిక నేతలతో కలసి పరిశీలించారు. పేదల కోసం నిర్మించిన ఇళ్లను పంపిణీ చేయకుండా కాలయాపన చేయడం తగదని నరసింహ యాదవ్ హితవు పలికారు. స్థానిక ఎమ్మెల్యే పేదల సమస్యలు పట్టించుకోకుండా.. ప్రభుత్వ కార్యక్రమాలను గంగ జాతరలా చేయడం తగదన్నారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి.. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తెదేపా విజయానికి శ్రమించాలని సూచించారు.
'టిడ్కో ఇళ్లను సంక్రాంతి లోపు పంపిణీ చేయాలి' - శ్రీకాళహస్తిలో టిడ్కో ఇళ్లను పరిశీలించిన తెదేపా పార్లమెంట్ ఇంఛార్జ్ నరసింహ యాదవ్
సంక్రాంతి లోపు టిడ్కో ఇళ్లను పేదలకు అందించాలని.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తెదేపా నేత నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సమస్యలను పట్టించుకోకుండా.. ప్రభుత్వ కార్యక్రమాలపై శ్రద్ధ పెట్టడాన్ని ఖండించారు.
నినాదాలు చేస్తున్న తెదేపా నేతలు
TAGGED:
tidco houses in srikalahasti