పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారులు పాల్గొనకుండా చేసేందుకే అధికార పార్టీ నేతలతో కలిసి పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ చిత్తూరు తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు పులివర్తి నాని ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గం మంగళం పరిధిలో కర్ణాటక మద్యం కలిగి ఉన్నారన్న ఆరోపణలపై తెదేపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదుట అభ్యర్ధుల కుటుంబసభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించిన నాని... తప్పుడు కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.
'మా అభ్యర్థులపై తప్పుడు కేసులు పెడితే చూస్తూ...ఊరుకోం' - chittor district news
పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతున్న అభ్యర్ధులు పోటీలో ఉండకూడదనే... పథకం ప్రకారమే పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ చిత్తూరు తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పులివర్తి నాని