ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగులూ.. బలి పశువులు కావొద్దు : అచ్చెన్న - తిరుపతిలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియా సమావేశం

తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు.. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. హంగు ఆర్భాటాలు ప్రదర్శించినప్పుడు రాని కరోనా.. స్థానిక ఎన్నికలకే వస్తుందా అని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుతోనైనా ఉద్యోగులు మేల్కోవాలని సూచించారు.

achennaidu press meet in tirupati
తిరుపతిలో అచ్చెన్నాయుడు మీడియా సమావేశం

By

Published : Jan 21, 2021, 7:48 PM IST

సీఎం జగన్ మాయలో పడి.. ప్రభుత్వ ఉద్యోగులంతా ఇప్పటికే పరువు పోగొట్టుకున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. కోర్టు తీర్పుతోనైనా ఉద్యోగులు మేల్కోవాలని తిరుపతి మీడియా సమావేశంలో సూచించారు.

ఇటీవల జరిగిన ప్రభుత్వ సమావేశాల్లో హంగు ఆర్భాటాలు ప్రదర్శించినప్పుడు రాని కరోనా సమస్య.. స్థానిక ఎన్నికలకే వస్తుందా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సీఎం జగన్ ఆడుతున్న నాటకంలో ఉద్యోగులు బలికావద్దని హితవు పలికారు.

ఇదీ చదవండి:అరెస్ట్​లతో తెదేపా ధర్మపరిరక్షణ యాత్రకు పోలీసులు బ్రేకులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details