కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ...రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేయాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్ నేత సుగుణమ్మ డిమాండ్ చేశారు. తిరుపతిలోని ఓ మద్యం దుకాణం వద్ద అందోళన నిర్వహించారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకుండా మందుబాబులు పోటీపడుతుండటంతో వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మద్యం విక్రయాలను కొన్నాళ్లపాటు నిలిపి వేయాలని కోరారు.
మద్యం దుకాణం ముందు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆందోళన - తిరుపతిలో తెదేపా నేత సుగుణమ్మ ధర్నా వార్తలు
చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ మద్యం దుకాణం ముందు తెదేపా సీనియర్ నేత సుగుణమ్మ ఆందోళన నిర్వహించారు. మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయాలంటూ డిమాండ్ చేశారు.
తిరుపతిలో మద్యం దుకాణం ముందు తెదేపా సీనియర్ నేత సుగుణమ్మ ఆందోళన