ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా నేత పీఆర్‌ మోహన్‌ మృతి.. తెదేపా ప్రముఖుల సంతాపం - latest news in chittor district

శ్రీకాళహస్తిలోని శాప్‌ మాజీ ఛైర్మన్‌, తెదేపా నేత పీఆర్‌ మోహన్‌ మృతి చెందారు. గుండెపోటుతో ఈ ఉదయం ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్​తో పటు ఇతర నాయకులు సంతాపం ప్రకటించారు.

TDP senior leader PR Mohan
తెదేపా సీనియర్​ నేత పీఆర్‌ మోహన్‌

By

Published : Jul 12, 2021, 12:12 PM IST

శాప్‌ మాజీ ఛైర్మన్‌, తెదేపా నేత పీఆర్‌ మోహన్‌ కన్నుమూశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని నివాసంలో గుండెపోటుతో ఈ ఉదయం ఆయన మృతిచెందారు. ఎన్టీఆర్‌ వీరాభిమానిగా 1983లో ఆయన తెదేపాలో చేరారు. న్యాయవాదిగా ఉంటూ తెదేపాలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1984లో పీఆర్‌ను శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా ఎన్టీఆర్‌ నియమించారు. 1994, 2014లో రెండు సార్లు శాప్‌ ఛైర్మన్‌గా పని చేశారు.

పీఆర్‌ మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్, ఇతర తెదేపానేతలు సంతాపం

పీఆర్‌ మోహన్‌ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​తో పాటు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎంపీ గల్లా జయదేవ్‌, సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు, తితిదే బోర్డు మాజీ సభ్యులు ఏవీ రమణ, తెదేపా ఇతర సీనియర్ నేతలు సంతాపం ప్రకటించారు. పీఆర్‌ మోహన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెదేపా ఆవిర్భావం నుంచి మోహన్‌ సేవలు వెలకట్టలేనివి అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌తో ఆయన అనుబంధం మాటల్లో చెప్పలేనిదని వివరించారు. తన పాదయాత్ర విజయవంతానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. శాప్‌ ఛైర్మన్‌గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారన్నారు. మోహన్‌ పార్టీ పట్ల అంకితభావంతో పని చేశారని లోకేశ్‌ అన్నారు. అతని మృతి పార్టీకి తీరని లోటని చెప్పారు.

ఇదీ చదవండీ..కంటిచూపు వెక్కిరించినా.. కల సాకారం

ABOUT THE AUTHOR

...view details