హైందవ ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలతో తిరుమల పవిత్రత దెబ్బతిందంటూ తిరుపతిలో తెదేపా నేతలు ఆందోళనలు చేపట్టారు. సీఎం జగన్ తిరుపతి నుంచి బయల్దేరిన వెంటనే కొత్తవీధి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి...ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కొడాలిని బర్తరఫ్ చేయాలని చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి నరసింహయాదవ్ డిమాండ్ చేశారు. శ్రీవారి ఆలయ పవిత్రతకు భంగం కలిగించే విధంగా సీఎం జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేయకుండా వెళ్లారన్న ఆయన...రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు.
'కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి' - కొడాలి నాని తాజా వార్తలు
కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చిత్తూరు జిల్లా తెదేపా నేతలు డిమాండ్ చేశారు. హైందవ ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలతో తిరుమల పవిత్రత దెబ్బతిందంటూ తిరుపతిలో ఆందోళనలు చేపట్టారు.

కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి