ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తెదేపా ఆందోళనలు - రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా ఆందోళనలు

హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తెదేపా నేతలు పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే దాడులు ఎక్కువయ్యాయని నేతలు మండిపడ్డారు. దాడులకు పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తెదేపా ఆందోళనలు
ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తెదేపా ఆందోళనలు

By

Published : Sep 18, 2020, 3:56 PM IST

హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో పలు జిల్లాలో కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తెలుగుదేశం నాయకులు ధర్మపోరాటం చేశారు. అంతర్వేదిలో రథం దగ్ధం, కనకదుర్గమ్మ దేవాలయంలో వెండి సింహాల చోరీ చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు పులిపర్తి నాని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే హిందువులపై దాడులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు.

ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలి

రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలన, హిందూ దేవాలయాలపై దాడులను ఖండిస్తూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో తెదేపా నేతలు ఆందోళనలు నిర్వహించారు. తిరుపతమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలి కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మారకపోతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుందని హెచ్చరించారు.

వైకాపా పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువు

వైకాపా పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందని ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే పాపారావు విమర్శించారు. తెదేపా అధిష్టానం పిలుపు మేరకు పట్టణంలో నాయకులతో కలిసి నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

'ఈఎస్​ఐ కుంభకోణంలో మంత్రి పాత్ర... బర్త్​రఫ్​ చేసి విచారించండి'

ABOUT THE AUTHOR

...view details