రాష్ట్రంలో బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి కేంద్రం హోం శాఖ జోక్యం చేసుకోవాలని తెదేపా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులు, మైనారిటీలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నా ముఖ్యమంత్రి మౌనంగా ఉండడం ఏమిటని ప్రశ్నించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో పోలీస్‌శాఖపై నమ్మకం పోతుందని విమర్శించారు. నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సీఐ, కానిస్టేబుల్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లాలో...
రాష్ట్రంలో ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు రక్షణ కల్పించాలని అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద బైఠాయించి ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో జగన్ ఓట్ల కోసం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై కపట ప్రేమ చూపించి ఇప్పుడు వారిపై చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు