ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎస్వీబీసీలో నీలి చిత్రాలు పంపిన వారిపై చర్యలు తీసుకోవాలి' - tdp protest at tirumala

ఎస్వీబీసీలో అశ్లీల చిత్రాల లింకులు పంపడంపై తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల మంది వీక్షించే భక్తి ఛానల్​లో ఆలాంటి లింకులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. నీలి చిత్రాలు పంపినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

dp protest at svbc  office
ఎస్వీబీసీలో నీలి చిత్రాలు పంపినవారిపై చర్యలు తీసుకోవాలి

By

Published : Nov 11, 2020, 9:50 PM IST

శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్​లో అశ్లీల చిత్రాల లింకులు రావడంపై తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తిరుపతిలో అలిపిరి వద్ద ఉన్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. శ్రీ వారి సొమ్ముతో ఉద్యోగులు జల్సా చేయడమే కాకుండా.. కోట్ల మంది వీక్షించే భక్తి ఛానల్​లో అశ్లీల లింకులు పెట్టడం ఏంటని తెదేపా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ప్రశ్నించారు. దీనిపై తితిదే ఈవో, ఛైర్మన్ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details