చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా నేతలు ఆందోళన నిర్వహించారు. కుప్పం రెస్కోను.. ఏపీఎస్పీడీసీఎల్లో విలీనం చేయటాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. కుప్పం నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులు నింపిన సంస్థను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రద్దు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చేెవరకూ ఆందోళన విరమించం'
కుప్పం రెస్కోను.. ఏపీఎస్పీడీసీఎల్లో విలీనం చేయటాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా నేతలు ఆందోళన నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులు నింపిన సంస్థను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రద్దు చేస్తోందంటూ వాపోయారు.
కుప్పంలో తెదేపా నేతలు ఆందోళన
రైతులకు రాయితీలపై ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్న సంస్థను.. రద్దు చేయటంపై పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ మేరకు కుప్పం రెస్కో ఎండీకి వినతిపత్రాన్ని అందజేశారు. తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు స్పష్టమైన ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ.. ఆందోళన విరమించబోమన్నారు
ఇదీ చూడండి.'రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా సాంకేతికత అభివృద్ధి చెందాలి'