తితిదే సమావేశాన్ని అడ్డుకున్న తెదేపా - ap politics
స్థానిక సమస్యలను అజెండాలో చేర్చలేదని ఆరోపిస్తూ.. తెదేపా నేతలు తితిదే సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సమావేశం ప్రాంగణం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
తెదేపా నేతల నిరసన
తిరుమల అన్నమయ్య భవన్ వద్ద ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా ఛైర్మన్ నరసింహ యాదవ్ బైఠాయించారు. తితిదే స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు ఆందోళన చేపట్టారు. నేడు జరిగే తితిదే బోర్డు సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. జనవరిలో వారం రోజుల పాటు దీక్షలు చేసినా ఫలితం లేకపోవటంతో నిరసన చేస్తున్నామని తెలిపారు.