ప్రచారానికి రాలేదని కక్షతో కొట్టిన వైకాపా నేతలు - punganuru
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో ఓ కుటుంబం వైకాపా దాడులకు బలైంది. ఆదివారం సాయంత్రం గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమానికి హాజరు కాలేదని ... కక్షకట్టి దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు.
కార్యక్రమానికి రాలేదని కక్షకట్టి కొట్టారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో ఓ కుటుంబంపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఆదివారం సాయంత్రం గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమానికి హాజరు కాలేదని ... కక్ష పెట్టుకొని దాడి చేశారని బాధితులు వాపోయారు. ఈ ఘర్షణలో భార్య, భర్తలతో పాటు కుమార్తె భాగ్యలక్ష్మీ గాయపడ్డారు. గతంలో ఇలాంటి దాడులు తమ కుటుంబంపై చేశారని. సంఘటనపై పోలీసులూ స్పందించలేదని తెలిపారు.