చిత్తూరు జిల్లా సోమల మండలం బండకాడలో మృతిచెందిన దళితుడు ఓంప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జిల్లాలోని సోమలలో 3 రోజుల క్రితం ఓంప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో మద్యం విధానంపై... సీఎం జగన్ను విమర్శిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు చేశాడు. అయితే ఓంప్రతాప్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమంటూ తెదేపా నేతలు ఆరోపణలు చేశారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, సదుం మండలంలో జరిగే ధర్నా కార్యక్రమానికి హాజరు కావడానికి బయలుదేరిన తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిలను గృహనిర్బంధం చేశారు.
చిత్తూరులో తెదేపా నేతల గృహనిర్భందం - అమర్నాథ్ రెడ్డిని గృహనిర్భందం చేసిన పోలీసులు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో మద్యం విధానంపై సీఎం జగన్ను విమర్శించిన యువకుడి మృతిచెందాడు. చిత్తూరు జిల్లాలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, సోమల మండలంలో జరిగే ధర్నా కార్యక్రమానికి హాజరు కావడానికి బయలుదేరిన తేదేపా నేతలు పులివర్తి నాని, అమర్నాథ్ రెడ్డిలు బయలుదేరగా వారిని పోలీసులు గృహనిర్భందం చేశారు.
చిత్తూరులో తెదేపా నేతల గృహనిర్భందం
Last Updated : Aug 28, 2020, 10:54 AM IST