జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ చేసే న్యాయపోరాటానికి మద్దతు తెలపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. వైద్యుడు సుధాకర్‌లా మరో ఎస్సీ ప్రాణాలు కోల్పోకుండా జడ్జి రామకృష్ణకు సహాయపడాలని తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ముఖ్యనేతల సమావేశంలో తీర్మానించారు. మేధావులు, ప్రజలు ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను ఖండించాలని పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. భారీ ప్రకటనలతో అనవసరంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఆ నిధులతో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు.
జడ్జి రామకృష్ణ తనయుడు వంశీకృష్ణ న్యాయపోరాటానికి తెదేపా మద్దతు - judge-ramakrishna arrest
చిత్తూరు కారాగారంలో ఉన్న జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉందంటూ ఆయన కుమారుడు వంశీకృష్ణ చేస్తున్న న్యాయపోరాటానికి మద్దతు తెలపాలని తెదేపా నిర్ణయించింది. జైలులో కత్తి లభ్యం ఘటనపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
జడ్జి రామకృష్ణ తనయుడు వంశీకృష్ణ న్యాయపోరాటానికి తెదేపా మద్దతు