తెదేపా హయాంలో తిరుపతి సమీపంలో టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన గృహ సముదాయాలను పేదలకు కేటాయించాలని మాజీఎమ్మెల్యే సుగుణమ్మ డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల సేకరణ కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యలను తప్పుపడుతూ తెదేపా నేతలు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తిరుపతి వాసులకు పరిసర ప్రాంతాల్లో కాకుండా.. వేరే గ్రామాల్లో కొండలు, గుట్టల్లో స్థలాలు కేటాయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో నిర్మించిన జీ ప్లస్ త్రీ భవంతులను లబ్దిదారులకు తక్షణమే కేటాయించాలని కోరారు. లేనిపక్షంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'తెదేపా హయాంలో కేటాయించిన ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వాలి'
ఇళ్ల స్థలాల సేకరణ కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యలను తప్పుపడుతూ తెదేపా నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొని తెదేపా హయాంలో టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన గృహ సముదాయాలను పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
తెదేపా నేతల ఆందోళన