చిత్తూరు జిల్లాలోని అమరరాజా ఫ్యాక్టరీ చెన్నైకి తరలిపోవడంపై.. చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాలలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లాలో అమర్ రాజా పరిశ్రమ ఉన్నందున వేలాదిగా యువకులు ఉపాధి పొందుతున్నారని... అలాంటి పరిశ్రమను ప్రభుత్వం కక్ష కట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్లే విధంగా చేస్తోందని మండిపడ్డారు.
రాష్ట్రానికి ఒక కొత్త పరిశ్రమను కూడా తీసుకురాలేని సీఎం.. ఉన్న పరిశ్రమలను తరలించడంపై మండిపడ్డారు. అమర రాజా ఫ్యాక్టరీ ప్రారంభించి 35 సంవత్సరాలు గడుస్తున్నా లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.