తెదేపా పాలనలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు తక్షణమే పంపిణీ చేయాలని మదనపల్లె మాజీఎమ్మెల్యే డి.రమేష్ డిమాండ్ చేశారు. పట్టణం శివారు ప్రాంతంలోని ఎర్రగానీ మిట్ట వద్ద నిర్మించిన అపార్ట్మెంట్ సముదాయం వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు మదనపల్లిలో 5000 మందికిపైగా ఇళ్లు ఇచ్చారని, ఇందులో మూడు వేల ఎనిమిది వందల వరకు పూర్తయ్యాయని తెలిపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం చంద్రబాబుపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించి పేదలకు తీరని అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు.
మదనపల్లెలో తెదేపా నేతల ధర్నా
వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఇళ్లను పక్కనపెట్టి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలకు సెంటు భూమిలో ఇల్లు నిర్మించి ఇవ్వడం హాస్యాస్పదమని మదనపల్లె మాజీఎమ్మెల్యే డి.రమేష్ విమర్శించారు. ఎర్రగానీ మిట్ట వద్ద నిర్మించిన భవన సముదాయం వద్ద తేదేపా నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
మదనపల్లెలో తెదేపా నేతల ధర్నా