అమరావతి రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని చిత్తూరు జిల్లా తిరుపతిలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. పట్టణ ఆర్డీఓ కార్యాలయం ముందు ప్లకార్డులతో ఆందోళన చేశారు.
'రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలి' - తిరుపతిలో తెదేపా ఆందోళన వార్తలు
అమరావతి రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతి పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు నరసింహయాదవ్ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేపట్టారు.
తిరుపతిలో తెదేపా ఆందోళన
ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులను విడుదల చేసి వారికి . .. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోరీ... దోచుకున్నదేమిటో మిస్టరీనే!