..
రాజధానిని మూడు ముక్కలు చేసి పాలించడం సబబు కాదు - పూతలపట్టులో తెదేపా నాయకుల ధర్నా
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని తెదేపా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసనరారులు పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ.. రాజధానిని మూడు ముక్కలు చేసి పాలించడం సబబు కాదన్నారు. తెరవెనుక ముఖ్యమంత్రి జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
నిరసన వ్యక్తం చేస్తున్న తెదేపా నాయకులు