ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండల పరిషత్ కార్యాలయం ఎదుట తెదేపా ఆందోళన - కెవిబీపురంలో తెదేపా ఆందోళన

చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలంలో అధికారులు, వైకాపా నేతలు కలిసి నామినేషన్ పత్రాల్లో సంఖ్యలను తప్పులతడకగా మార్చేశారని తెదేపా మద్దతుదారులు ఆందోళనకు దిగారు.

అధికారులతో మాట్లాడుతున్న తెదేపా నేతలు
అధికారులతో మాట్లాడుతున్న తెదేపా నేతలు

By

Published : Feb 13, 2021, 2:28 PM IST

చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండల పరిషత్ కార్యాలయం ఎదుట తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. నామినేషన్ పత్రాలను అధికారులు, వైకాపా నేతలు కలిసి తప్పులతడకగా మార్చేశారని వారు ఆరోపించారు. ఎంపీడీవో నరసింహమూర్తి ఆధ్వర్యంలోని నామినేషన్లను ఉద్దేశపూర్వకంగానే తప్పుల తడకగా మార్చేశారని తెదేపా నేతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details