ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతుల కన్నీరు రాష్ట్ర సంక్షేమానికి మంచిది కాదు' - amaravathi protest

చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో తెదేపా నేతలు సమావేశం నిర్వహించారు. రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

tdp-leaders-press-meet-in-vedurukuppam-chitthore-district
వెదురుకుప్పంలో తెదేపా నేతల సమావేశం

By

Published : Oct 11, 2020, 3:49 PM IST

రైతుల కన్నీరు.. రాష్ట్ర సంక్షేమానికి మంచిది కాదని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెదేపా నేతలు హెచ్చరించారు. వెదురుకుప్పంలో జిల్లా పార్టీ సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షుడు ముని చంద్రారెడ్డి... సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన అన్నదాతలు ఆవేదన చెందడం... ప్రభుత్వ కర్కశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. రాజధాని రైతులకు న్యాయం చేసి, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతుల కోసం తెదేపా పోరాటం కొనసాగుతుందన్నారు.

ఇదీ చదవండి:

మరో వివాదం: సింహాద్రి అప్పన్న కానుకలు మాయం

ABOUT THE AUTHOR

...view details