మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తెదేపా నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మదనపల్లిలో అన్నదానం చేశారు. ఎన్టీఆర్ సేవలను కొనియాడారు.
పుత్తూరులో తెదేపా నేతలు ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. కెనరా బ్యాంకు వద్ద ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. అనంతరం అన్నదానం చేశారు. తెలుగు ప్రజల గౌరవాన్ని దశదిశలా వ్యాప్తి చేసిన నేత ఎన్టీఆర్ అని నేతలు కీర్తించారు.