అక్రమాలకు పాల్పడటంలో వైకాపా రికార్డు సాధించిందని తెదేపా నేత అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. పాలనపై నమ్మకం లేకనే వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వైకాపా నేతలు ఓటుకు రూ. 10 నుంచి 15 వేలు పంచారని ఆరోపించారు. చివరకు అంబులెన్స్‌లోనూ ఓటర్లను తరలించారన్నారు. బ్యాలెట్ పెట్టెలు మార్చేందుకు యత్నించారన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. కుప్పంలో తెదేపా ఘన విజయం సాధిస్తుందని అమర్నాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైకాపా పతనం కుప్పం నుంచే ప్రారంభమైందన్నారు.
రూ.100 కోట్లు పంచారు: నిమ్మల