ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి: తెదేపా నేతలు - tdp protest at chittor district latest news

చిత్తూరు జిల్లా చంద్రగిరి రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

tdp leaders protest at chandra giri
చంద్రగిరిలో తెదేపా నేతల నిరసన

By

Published : Dec 29, 2020, 4:15 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి పరిధిలో నివర్, బురేవీ తుపానుల ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలుగుదేశ నేతలు డిమాండ్ చేశారు. త్వరితగతిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని కోరారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించిన నేతలు... అధికారులు స్పందించకుంటే పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. తుపానులతో నష్టపోయిన రైతులను ఇటీవల పరామర్శించిన తెలుగుదేశం నాయకులు... గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల వివరాలతో సమగ్ర నివేదిక తయారుచేసి ఆర్డీఓకు అందించారు.

చంద్రగిరిలో తెదేపా నేతల నిరసన

ABOUT THE AUTHOR

...view details