శాసనమండలి సభ్యుడు బీటెక్ రవి అరెస్ట్‌ను నిరసిస్తూ తెదేపా నేతలు తిరుపతిలో ఆందోళన చేశారు. నగరంలోని గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. దళితులకు అండగా నిలిచిన తమ పార్టీ నేతను అక్రమంగా అరెస్ట్ చేశారని, వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీటెక్ రవి అరెస్ట్‌ను నిరసిస్తూ తెదేపా నేతల ర్యాలీ - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
శాసనమండలి సభ్యుడు బీటెక్ రవి అరెస్ట్‌ను నిరసిస్తూ తెదేపా నేతలు తిరుపతి నగరంలో ర్యాలీ నిర్వహించారు. దళితులకు అండగా నిలిచినందుకే తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు.
బీటెక్ రవి అరెస్ట్‌ను నిరసిస్తూ తెదేపా నేతల ర్యాలీ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని నేతలు ఆరోపించారు. పులివెందులలో దళిత మహిళ హత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయలేదని, బాధితులకు అండగా నిలిచిన పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి:ప్రైవేటు ఆలయాల్లోనే దాడులు.. రాజకీయ గెరిల్లా యుద్ధాన్ని పోలీసులే అడ్డుకోవాలి...